వైరస్ దాడికి మొత్తం మీ పెన్ డ్రవ్ లేదా కొన్నిసార్లు హార్డ్ డిస్క్ పార్టిషన్స్ లోని ఫోల్డ్ లన్ని షార్ట్ కట్స్ గా మారిపోవచ్చు.కంగారు పడకుండా,దేనినీ డిలీట్ చేయకుండా ఉంటే చాలు.మీ సమాచారమంతా భద్రమే.
మీరు చేయాల్సిందల్లా ఎడ్రస్ బార్ కి వెళ్ళి మీ ఒక్కో ఫోల్డర్ పాత్ ని టైప్ చేసి చూడండి.లేదా ఎక్స్ప్లోరర్ వ్యూ లో ఒక్కో ఫోల్డర్ ని క్లిక్ చేసి చివరి డాట్ ఎల్. ఏన్.కే(లింక్)అనే ఎక్స్టెన్షన్ నేమ్ ని డిలీట్ చేసినా ఆదే అద్భుతాన్ని చూడొచ్చు.ఫైలన్నింటిని కాపీ చేసి మరో చోట పేస్ట్ చేసుకోవడమే.
కాపీ పేస్ట్ తో ముసుకో ట్రోజన్ ని మట్టు పెట్టాము.ఏ ఆంటీ వైరస్ దీనికి అక్కరలేదు.
కాకపోతే ఏ వైరస్ దాడి చేసినా వెంటనే “సిస్టమ్ రిస్టోర్” తో బ్యాక్ డేట్ కి పోయి దాడి ని తప్పించు కుంటాం, కాని ఈ ట్రోజన్ “సిస్టం రిస్టోర్”ని మొదట పనిచేయనివ్వదు.
.