కుక్కలు ఓటేస్తే …..

అక్టోబర్ 24, 2015

కుక్కలు ఓటేస్తే
సింహాసనమెక్కి
క్రిందున్నందుకు
రాళ్ళతో కొడతారు

కుక్కలు వదులుకోవల్సింది
పార్లమెంటు కేంటిన్ లలో వదులు కోనిది
స్వచ్చంద రాయితీలు

మానవత్వం చిరునామా
కోల్పోయాక
మృగ న్యాయమే
రాజ్యమేలుతోంది

సమాజం
సిగ్గు తో చస్తుంటే
ప్రభుత్వాలు
మౌన ముద్ర లో
మునిగితే

చిల్లుపడిన నావ ను
కవిత్వాలు
నిలబెట్ట లేవు

కవిత్వాలు ఆకాశపుటంచులు
దాటినా
నిజం నగ్నం గా నర్తిస్తోంది.

చీకటి పనులు
వెలుగు చూస్తుంటే
అసహనం అర్రులు చాస్తుంటే
పేదోడి పయనం
అధ్:పాతాలాని కాదా ?

ప్రకటనలు